ఆగస్ట్ 31 మరియా మాంటిస్సోరి జయంతి. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు మన పిల్లలందరూ చదువుకునే మాంటిస్సోరి విద్యా వ్యవస్థ రూపకర్త ఆమె. అయితే ఈ విప్లవాత్మకమైన విద్యా వ్యవస్థను రూపొందించకపోయినా ఆమె పేరు చరిత్ర పుటలలో మరో రూపంలో నిలిచే ఉండేది. 1883-84 లో తన పదమూడు సంవత్సరాల వయసులో ఆమె అందరూ మగపిల్లలే ఉండే సాంకేతిక విద్యా పాఠశాలలో చేరింది. ఆమె ఈ సాంకేతిక విద్యను ఎంతో ఇష్టంతో ఎన్నుకుంది. ఇంజనీర్ కావాలనేది ఆమె కోరిక. అది ఆ రోజుల్లో ఆడపిల్లలు కలలో కూడా ఊహించనిది. 1890 లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే నాటికి ఆమె మనసు మార్చుకుని డాక్టర్ కావాలనుకుంది. అది కూడా ఏమంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదు. యూనివర్సిటీ ఆఫ్ రోమ్ లో మెడిసిన్ కోసం అప్లై చేసుకుంటే ఆమెకు ఏ మాతం ప్రోత్సాహం లభించలేదు. దానితో ఆమె నాచురల్ సైన్సెస్ ను ఎంపిక చేసుకుని 1892 లో డిప్లొమా ఇన్ డి లైసెంజా పట్టా పొందింది. దీనితో పాటు లాటిన్, ఇటాలియన్ భాషలలో కూడా పట్టు సాధించడంతో 1893 లో ఆమెకు యూనివర్సిటీ లో మెడిసిన్ సీట్ లభించింది. అయితే అది మొదటి అడుగు మాత్రమే. ఇతర విద్యార్థుల నుండి, ప్రొఫెసర్ ల నుండి ఆమె ఎంతో వివక్ష, ఒత్తిడులను ఎదుర్కొంది. మగపిల్లలతో కలిసి నగ్న మృత దేహాలను పరిశీలించడానికి ఆమెకు అనుమతి లేదు. కాలేజీ వేళలు ముగిశాక ఆమె ఒంటరిగా మృతదేహాలకు డిసెక్షన్ నిర్వహించవలసి వచ్చేది. ఇవేమీ ఆమెను ఆపలేకపోయాయి. 1896 లో యూనివర్సిటీ ఆఫ్ రోమ్ నుండి ఆమె గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. అప్పటి సమాజ కట్టుబాట్ల వలన ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో వేదనను ఎదుర్కొంది. తన సహోద్యోగి అయిన గిసుఎప్పీ మోంటేసానో ను ఆమె ప్రేమించి అతనితో ఒక బిడ్డను కూడా కన్నది. అయితే అతనిని పెళ్ళి చేసుకోలేకపోయింది. పెళ్ళి చేసుకున్నట్లైతే ఆమె తన ఉద్యోగ జీవితం నుండి విరమించుకోవలసి వచ్చేది. ఆమె చిన్న పిల్లల వైద్యంలో ప్రత్యేక శిక్షణ పొందింది. మానసిక వైకల్యం గల పిల్లలకు విద్యను అందించేందుకు కృషి చేసింది. 1906 లో రోమ్ లోని శాన్ లోరెంజో అనే చిన్న పట్టణంలోని అత్యంత నిరుపేద వర్గాల పిల్లల కోసం ఒక చైల్డ్ కేర్ సెంటర్ ను ప్రారంభించింది.వారికి గతంలో పాఠశాల ముఖం చూసిన అనుభవమే లేదు. ఆ కేంద్రాన్ని కేస డెయి బాంబిని అని పిలిచేవారు. ఇటాలియన్ లో దీని అర్ధం పిల్లల ఇల్లు అని. వారికి చదువు అబ్బదు అని ముద్ర వేయబడ్డ పిల్లలందరికీ అక్కడ ఎంతో నాణ్యమైన విద్య అందే ఏర్పాటు చేసిందామె. దాదాపు 50-60 పిల్లలు అక్కడ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ కేంద్రం యొక్క భవన సంరక్షకుడి కుమార్తె డాక్టర్. మాంటిస్సోరి మార్గదర్శకత్వంలో అక్కడ మొదటి టీచర్ గా పని చేసింది.

ఈ పాఠశాల అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కొన్ని రోజులకే పిల్లలు పజిల్స్ ను పరిష్కరించడం, వంట చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటివి నేర్చుకోవడంతో పాటు క్రమశిక్షణతో పద్దతిగా ఉండి విషయం పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు.
మాంటిస్సోరి ఈ పాఠశాలలో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చి కొద్దినాళ్ళకే కేవలం ఇటలీ లోనే కాక ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఈ నమూనాను అమలు చేయడం ప్రారంభించారు. మాంటిస్సోరి అనేది ప్రతి ఇంటిలోనూ చిరపరిచితమైన పేరుగా మారింది. భారతదేశంలో కూడా మాంటిస్సోరి విద్యా విధానం 1920 నుండే అమలు చేసిన చరిత్ర ఉంది.
ఈ విద్యా విధానం ఇప్పటి పిల్లలకు ఎంతో అవసరం అనడంలో ఏ సందేహమూ లేదు. ప్రతి అంగన్వాడీ, ప్రాధమిక పాఠశాల మాంటిస్సోరి పాఠశాల కావాలి. ఈ మాంటిస్సోరి విద్య ప్రధానంగా తమ కుటుంబాలలో చదువుకుంటున్న మొదటి తరం పిల్లలను, అత్యంత నిరుపేద కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. మొదటి ఉపాధ్యాయురాలు కూడా పెద్దగా చదువు లేని ఒక భవన సంరక్షకుడి కూతురు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే మాంటిస్సోరి విద్య అత్యంత అవసరమైన, తప్పనిసరిగా అమలు చేయాల్సిన, అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండే విద్యా నమూనాగా అర్ధం చేసుకోవచ్చు.
అయితే మన విద్యా విధానం అంతా ధనికులు, పలుకుబడి కలిగిన వర్గాల పిల్లలకోసం ఏర్పాటు చేసిన పాఠశాలల నమూనాలో నడుస్తుండటం మన దురదృష్టం. ఈ పాఠశాలల ఫీజులు కనీసం మధ్య తరగతి వర్గాల వారికి కూడా అందుబాటులో ఉండటం లేదు.
మాంటిస్సోరి పద్ధతుల మూల సూత్రాలను పక్కనపెట్టి తక్కువ ఖర్చుతో చేయవల్సిన విద్యా బోధనను ఎవరికీ అందుబాటులో లేని, విస్తృతంగా అమలు చేయడానికి వీలుకాని నమూనాగా మనమే మార్చివేశామా?
ఇప్పుడు కొత్తగా ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసుగల పిల్లలకు కూడా విద్యను అందించవలసిన అవసరాన్ని గుర్తించింది. మాంటిస్సోరి విద్యా విధానం గురించి పునర్విమర్శ చేసి ప్రతి విద్యా సంస్థలోనూ దీనిని ఒక అభ్యాస ప్రాతిపదికగా, విద్యా బోధనా విధానంలో భాగంగా మార్చేందుకు ఇదే సరైన సమయం.
Translated by Bharathi Kode from Meena’s piece
అభినదద
LikeLike
*జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డు*
*ఈ నెల 24న ఢిల్లీలో అవార్డు తీసుకోనున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు*
ఫిబ్రవరి 19, అనంతపురము
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో అనంతపురము జిల్లా ముందు వరుసలో ఉంటుందని మరోసారి రుజువైంది. తాజాగా కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని జిల్లా సత్తా చాటింది. పీఎం కిసాన్ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవంతో పాటు పథకం అమలులో ముందు వరుసలో ఉన్న జిల్లాలకు అవార్డులు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పీఎం కిసాన్ లో లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో జిల్లాకు అవార్డు వరించింది.
పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరైఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో జిల్లాకు అవార్డు దక్కింది.
జిల్లాకు అవార్డు రావడంపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు. అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న అనంతపురము జిల్లా అభివృద్ధి, సంక్షేమంలోనూ ముందు వరుసలో ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. గతంలో కిసాన్ రైలు వంటి కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కిందని, ఇప్పుడు వ్యవసాయ రంగంలోనే మరో అవార్డు దక్కడం ద్వారా రైతుల కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందన్నారు.
ఫిబ్రవరి 24న న్యూఢిల్లీ పుసా భవనంలో నిర్వహించనున్న పీఎం కిసాన్ వార్షికోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టరు అవార్డు స్వీకరించనున్నారు.
…………..
*సహాయ సంCongrats jiచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ….*
LikeLike
Thanks so much for your appreciation. It is indeed a source of inspiration to keep on!
LikeLike