గత వారం ఎవరో మాకు రూపం మరియు రంగులో పరిపూర్ణంగాఉన్న ఒక పండు ఇచ్చారు. దానిపేరు పెర్సిమోన్ అని చెప్పారు.. నేనుజపనీస్ సాహిత్యంలో పెర్సిమోన్ యొక్క వర్ణనలను, దాని పైన అనేకకవితలను చదివాను. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఈ విదేశీపండును చూడలేదు, దాని రుచి గురించి అసలు తెలియదు.
ఇప్పుడు భారతదేశంలో విక్రయించబడుతున్న అనేక అన్యదేశపండ్లలో ఇది ఒకటి. మనం ఒకప్పుడు తింటూ పెరిగిన నేరేడు, సీతాఫలం, జామ, అరటిపండ్లు వంటి పండ్ల కన్నా మన పిల్లలకుకివి, డ్రాగన్ ఫ్రూట్ వంటి వాటి రుచి ఎక్కువగా తెలుసు.
ఇప్పుడు ఎన్నో కొత్త రకాల పండ్లను మన దేశంలోనే పండిస్తుండడం, ఇతర దేశాల నుండి అనేక రకాల పండ్లను దిగుమతిచేస్తుండడంతో ఏవి స్థానికమైనవి, ఏవి ఇతర దేశాలకు చెందినవిఅనే విభజన రేఖ చిన్నగా చెరిగిపోతూ ఉంది. ఇప్పుడు పండ్లనునిల్వ చేసే సదుపాయాలు కూడా మెరుగుపడడంతో అన్ని పండ్లుఅన్ని సీజన్ లలోనూ దొరుకుతున్నాయి.
మన పండ్లను గురించి, వాటి మూలాల గురించి తెలుసుకోవాల్సినఅవసరం బహుశా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ‘ఎ హిస్టారికల్ డిక్షనరీఆఫ్ ఇండియన్ ఫుడ్’ అనే పుస్తకం సహాయంతో నేను పండ్లగురించి చాలా వివరాలు తెలుసుకున్నాను. వాటిలో కొన్నిఆసక్తికరమైన వివరాలు మీకోసం.
మనకి లభించే ఆహార పదార్ధాలలో పండ్లు ‘ఫల’ అనే వర్గానికిచెందినవి. దీని అర్ధం వరి, పప్పు ధాన్యాల లాగా నాగలితో దున్నిపండించవలసిన అవసరం లేనివి.
దా

నిమ్మ, నేరేడు, ఉసిరి, నిమ్మ, మామిడి, చెరుకు, ద్రాక్ష, అరటి, కొబ్బరి, పనస వంటివి చారిత్రాత్మకంగా భారతదేశానికి చెందినఫలాలు. వీటి గురించిన ప్రస్తావన మన వేద సాహిత్యంలోఉండడమే కాకుండా అనేక పురాతన వైద్య విధానాలలో కూడా ఈపండ్లను వినియోగించే పద్దతి ప్రస్తావించబడి ఉంది.
వీటిలో అనేక రకాల పండ్లు ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో వండర్ఫుడ్స్ గా గుర్తించబడ్డాయి. ఉసిరి, రేగు పండ్ల వంటివి విటమిన్ సిఅధికంగా ఉండే పండ్లుగా ప్రపంచ ఖ్యాతి పొందాయి.
ఇటీవల కాలంలో ఆపిల్, మల్బరీ, ఆప్రికాట్ వంటి పండ్లు కూడాఆరోగ్యానికి మేలు చేసేవిగా గుర్తింపు పొందాయి. ఇవి గతంలో అంతనాణ్యమైనవిగా లేకున్నప్పటికీ మొఘలుల కాలంలో గ్రాఫ్టింగ్ ద్వారావీటి నాణ్యతను మెరుగుపరచడం జరిగింది.
క్రీస్తు శకం 1500 సంవత్సరం తర్వాత బొప్పాయి, సపోటా, జామ, అనాస, సీతాఫలం, అవొకాడో వంటి పండ్లు దక్షిణ, మధ్య అమెరికాదేశాల నుండి దిగుమతి చేసుకోబడ్డాయి. అయితే ఇక్కడ కూడావీటిని విస్తృతంగా పండించడం మొదలయ్యాక ఇవి కూడా స్థానికపండ్లుగా మారిపోయాయి.
పురాతన వైద్య విధానాలపై మనకు లభిస్తున్న తొలిపుస్తకమైనసుశ్రుత సంహితలో పండ్లను ఆహారంలో భాగంగా ఏ విధంగామార్చుకోవాలో వివరంగా ఉంది. భోజనం చేసేటప్పుడు తొలిగాపండ్లను తీసుకోవాలని అందులో మొదటగా దానిమ్మ, ద్రాక్ష వంటినమిలి తినవలసిన పండ్లను, తర్వాత చెరకు, ఖర్జూరం, మామిడివంటి పండ్లను తీసుకోవాలని ఈ పుస్తకం సూచిస్తుంది.
మామిడి, నిమ్మ వంటి పండ్లను పచ్చళ్ళ రూపంలో నిల్వ చేయడంమన దేశంలో సాంప్రదాయంగా వస్తున్న అలవాటు. గుజరాత్ వంటిరాష్ట్రాలలో తీయటి, పుల్లటి పచ్చళ్ళ రూపంలో కూడా నిల్వ చేస్తారు. ముస్లింల యునాని వైద్య పద్దతి ప్రాచుర్యం లోకి వచ్చాక పండ్లనుచిక్కటి పంచదార పాకం రూపంలోకి మార్చి వాటికి అల్లం, చెక్క, లవంగాల రుచిని అద్ది చేసే మురబ్బాలు పండ్లను నిల్వ చేసేపద్దతిగా వెలుగులోకి వచ్చింది.
పండ్లను పులియబెట్టి మద్య పానీయాల తయారీకి వాడడం కూడాఅధికంగా ప్రాచుర్యంలో ఉంది. ఆయుర్వేద వైద్య విధానాలపైఅందుబాటులో ఉన్న అత్యంత ప్రాచీన పుస్తకం చరక సంహితలో ఈమద్యం యొక్క తయారీకి వాడదగిన పండ్లుగా చెరకు (దానిఅనుబంధ ఉత్పత్తులైన మొలాసిస్, బెల్లం), ద్రాక్ష, మామిడి, వెలగపండు, ఖర్జూరాలు, అరటి, పనస, దానిమ్మ వంటి పండ్లుసూచించబడి ఉన్నాయి.
ఈ పచ్చళ్ళు, పండ్లతో చేసిన వైన్ లను ఏ ఋతువులోవినియోగించినా బాగుంటుంది కానీ మామిడి, పుచ్చకాయ వంటిపండ్లు శీతాకాలంలో దొరికితే కొంత వింతగానే అనిపిస్తుంది. మండువేసవిలో తొలిసారిగా మామిడి ముక్కని కొరకడం, దీపావళిసమయంలో వచ్చే సీతాఫలాలకై ఎదురు చూడడం మనందరిజీవితంలో భాగంగా మారిపోయాయి. ఈ స్థానికంగా ఋతువులవారీగా దొరికే పండ్లను తినడంలోని ఆనందం ఎప్పుడైనా దొరికే ఈడ్రాగన్ ఫ్రూట్, పెర్సిమ్మోన్స్ వంటి విదేశీ పండ్లను తినడంలో ఎప్పటికీదొరకదు అని నాకు అనిపిస్తుంది.
2021 ని అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరంగాప్రకటించారు. ఈ ఏడాదైనా మనం తింటున్న పండ్లు ఏమిటి, వాటిమూలం ఏమిటి, ఎక్కడ నుండి వచ్చాయి, మనకు అందుబాటులోకిఎలా వస్తున్నాయి, వాటిని ఎలా తింటున్నాం, ఎంత ఆస్వాదిస్తున్నాంఅని ఆలోచిస్తే బాగుంటుందేమో. పండ్లకి ఇంగ్లీష్ పదమైన ఫ్రూట్ కిమూలం లాటిన్ పదం ఫ్రూక్టస్. దీనికి అర్ధం ఆస్వాదించడం. మనంతింటున్న ప్రతి ఒక్క పండును దాని గురించి తెలుసుకుంటూఆస్వాదించే ప్రయత్నం చేద్దాం.
—Based on a piece by Mamata
Is sugarcane friut ?
LikeLike
No indeed! It is a grass. Sorry for the slip.
LikeLike