ఆ మధ్య జరిగిన ఒక వ్యవసాయ మేళా కి వెళ్ళినప్పుడు నాస్నేహితురాలు ఈ ఫోటో తీసింది. మరొక స్నేహితురాలు ఈశాన్యరాష్ట్రాలలో ట్రెక్కింగ్ కి వెళ్లి అక్కడి నుండి నాకోసం ఎంతో కారంఉండే మిరపకాయలు తెచ్చింది. వాటి ఫోటోలు మీతో పంచుకుంటూకాసేపు మిరపకాయల గురించి కూడా మీతో చర్చిద్దామని ఈ బ్లాగ్.
సోలానాసీఏ కుటుంబానికి చెందిన జెనస్ క్యాప్సికమ్ పండ్ల జాతికిచెందినదే ఈ మిరప. క్యాప్సికమ్ అనే పదం గ్రీకు భాషలోని కాప్సిమోఅనే పదం నుండి వచ్చింది. కొరికి తినడం అని దాని అర్ధం. దీనిమూలాలు దక్షిణ అమెరికాలోని పెరు ప్రాంతంలో ఉన్నాయి అనిఅంటారు. దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమేమిరపకాయలను అక్కడ సాగు చేసేవారు.
1493 లో క్రిస్టోఫర్కొలంబస్ మిరప విత్తనాలను దక్షిణ అమెరికా నుండి స్పెయిన్ కుతీసుకుని వచ్చాడు. అక్కడి నుండి మిరప ఇక ప్రపంచమంతాప్రయాణం చేసింది. 15 వ శతాబ్దం చివరలోనో, 16 వ శతాబ్దంమొదటిలోనే పోర్చుగీసు వారు మిరపను దక్షిణ ఆసియాకుపరిచయం చేశారు. ఇప్పుడు మిరపకాయలో, వాటితో చేసిన కారమోలేకుండా మన వంటలను ఊహించగలమా
మిరపకాయల గురించి మాట్లాడుకునేటప్పుడు వాటి ఘాటునుగురించి మాటలాడుకోవడం సహజం. అయితే ఈ ఘాటును ఎలాకొలుస్తారు. మిరపకాయలలో, ఇతర మసాలా పదార్ధాలలో ఉండేఘాటును కొలిచేందుకు స్కోవిల్లే స్కేల్ అనే దానిని ఉపయోగిస్తారు. స్కోవిల్లే హీట్ యూనిట్స్ (SHU) లలో ఘాటును కొలుస్తారు. మిరపకాయలు, ఇతర మసాలా పదార్ధాలలో ఘాటు రావడానికికారణమైన క్యాప్సిసిన్ అనే ఆల్కలాయిడ్ శాతాన్ని బట్టి ఈ కొలతఉంటుంది. అమెరికాకు చెందిన ఫార్మసిస్ట్ విల్బర్ స్కోవిల్లే 1912 లోస్కోవిల్లే ఆర్గానోలెప్టిక్ టెస్ట్ పేరుతో ఆహార పదార్ధాల ఘాటునుకొలవడం ప్రారంభించారు. ఆయన రూపొందించిన స్కేల్ నుఆయన పేరుతోనే స్కోవిల్లే స్కేల్ అని పిలవడం జరుగుతుంది. మొదట్లో మనుషులు ఆహారపదార్ధాన్ని రుచి చూసి రేటింగ్ ఇవ్వడంద్వారా ఈ SHU రేటింగ్ ను నిర్ణయించేవారు. అయితే ఆ పద్ధతిలోరేటింగ్ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే SHU నునిర్ధారించడానికి లిక్విడ్ క్రోమాటోగ్రఫీ పద్ధతిని వాడుతున్నారు.

ప్రపంచం మొత్తంలో అన్నిటికన్నా ఘాటు ఎక్కువగా ఉండేమిరపకాయలు ట్రినిడాడ్, టొబాగో లో పండుతాయి. ట్రినిడాడ్మొరుగా స్కార్పియన్ అని పిలవబడే ఈ మిరపకు దాదాపు2009231 SHU ల ఘాటు ఉంటుంది.
మనదేశంలో నాగాలాండ్ లో పాండే భూత్ జోలోకియా జాతిమిరపకాయలు అన్నిటికన్నా ఘాటైనవి. ప్రపంచం మొత్తంలో చూస్తేఘాటు విషయంలో ఇవి నాలుగవ స్థానంలో ఉన్నాయి. వీటి SHU దాదాపు 1041427 గా ఉంది.
భారతదేశంలో పండే మరికొన్ని మిరప జాతుల వివరాలు చూద్దాం:
కాశ్మీరీ మిరప: ఘాటు కన్నా రంగు బాగుంటుంది
గుంటూరు మిరప: గుంటూరు సన్నం S4 అని పిలవబడే ఈ మిరపవలెనే ఆంధ్రా వంటలకు ఆ ప్రత్యేకమైన ఘాటు, రుచి ఉంటుంది
బర్డ్స్ ఐ మిరప: దీనినే థాయ్ మిరప అని కూడా అంటారు. మనదేశంలో ఈశాన్య ప్రాంతంలో పండుతుంది. ఎంతో ఘాటుగా, ప్రత్యేకమైన రుచితో ఉంటుంది
కంథారి మిరప: కేరళలో పండే ఈ మిరప ఎండే కొద్దీ తెలుపురంగులోకి మారుతుంది.
ముండు మిరప: తమిళనాడు, ఆంధ్ర లలో పండించే ఈ మిరపచిన్నగా, గుండ్రంగా ఉండి పలుచని పొరతో ఉంటుంది. ఇవి అంతఘాటుగా ఉండవు కానీ ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది.
జ్వాలా మిరప: ప్రధానంగా గుజరాత్ లో పండుతుంది
బ్యాదాగి మిరప: కర్ణాటకలో పండే ఈ మిరప పొడవుగా, పలుచగాఉంటుంది. ఎండిన తర్వాత వంకరగా ఉంటుంది.
ఈ సారి ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు మీరేదోవంటల గురించి బాగా తెలిసిన వారిలా కనిపించాలనుకుంటే మీకువడ్డించిన పదార్థంలో SHU స్థాయి ఎంత అని అడిగిచూడండి.
—Based on a piece by m