మనం ఎన్నో నినాదాలు చూస్తుంటాం. వింటుంటాం. అనేక సంస్థలు, దేశాలు, ఉద్యమాలు తమవైన నినాదాలు రూపొందించుకుంటాయి. అవి ఆయా సంస్థల, ఉద్యమాల లక్ష్యాన్ని, వారు సాధించాలన్న ఉద్దేశాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి. అనేక కంపెనీలు కూడా తమవైన నినాదాలు రూపొందించుకుని ఉంటాయి. వాటి లోగోలలాగే ఈ నినాదాలను కూడా గర్వంగా తమ కంపెనీ పేరుతో పాటు ప్రదర్శించడం పరిపాటే.

సత్యమేవ జయతే (సత్యం మాత్రమే గెలుస్తుంది) అనేది మన దేశం యొక్క నినాదం. మనదేశంలోని వివిధ విభాగాలకు కూడా తమవైన నినాదాలు ఉన్నాయి: యతో ధర్మస్తతో జయః (ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుంది) అనేది మన సుప్రీం కోర్ట్ నినాదం, The safety, honour and welfare of your country అనేది మన దేశ ఆర్మీ నినాదం. నాభా స్పర్శం దీప్తం (Touch the sky with glory) అనేది మన ఎయిర్ ఫోర్స్ నినాదం కాగా, షామ్నో వరుణః (May the Lord of Water be auspicious unto us) అనేది మన నేవీ యొక్క నినాదం.
ఇతర దేశాలకు కూడా కొన్ని ఆసక్తికరమైన నినాదాలు ఉన్నాయి.
Truth prevails: మన సత్యమేవ జయతే కు సమానార్థకంగా ఉండే ఈ నినాదం చెక్ రిపబ్లిక్ దేశానిది.
Janani Janmabhumishcha Swargadapi Gariyasi: మన లాగే ఈ నేపాల్ దేశపు నినాదం కూడా సంస్కృత గ్రంధాల నుండి తీసుకున్నదే
Rain: బోత్స్వానా దేశపు ఈ ఒకే ఒక్క పదంతో కూడిన నినాదం వ్యవసాయాధారిత దేశంలో వర్షం యొక్క ప్రాముఖ్యతని సూచిస్తూ ఆ వర్షానికి గౌరవాన్ని ఇస్తూ నినాదంగా స్వీకరించబడింది
Liberté, égalité, fraternité: ఫ్రెంచ్ విప్లవపు ఈ నినాదమే ఇప్పుడు ఫ్రాన్స్, హైతీ దేశాలకు నినాదంగా ఉంది
In God we trust: 1956 లో ఇది అమెరికా యొక్క అధికారిక నినాదంగా స్వీకరించబడింది. దీనికి ముందు ‘E pluribus unum’ అనేది అమెరికా నినాదం గా ఉండేది. ‘Out of many, one’ అనేది దీని అర్ధం.
యునైటెడ్ కింగ్డమ్, చైనా, బంగ్లాదేశ్, డెన్మార్క్ వంటి దేశాలకు ఎటువంటి అధికారిక నినాదమూ లేదు.
వ్యాపార సంస్థలకు కూడా తమవైన నినాదాలు ఉన్నాయి. కొన్ని ఎంతో లోతైన విస్తృతమైన అర్ధాన్ని కలిగి ఉంటే మరికొన్ని వారు సాధించాలన్న లక్ష్యాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి.
టాటా సంస్థలు: Leadership with Trust.
విప్రో: Applying thought
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: Experience certainty.
రిలయన్స్ ఇండస్ట్రీస్: Growth is Life.
కొన్ని స్వచ్చంద సంస్థలు కూడా తమ లక్ష్యాన్ని సూచించే నినాదాలను రూపొందించుకున్నాయి.
ప్రథం: Every child in school and learning well.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ: I Serve
బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్: Touching People, Changing Lives
అడయార్ కాన్సర్ ఇన్స్టిట్యూట్: With Humanity and In Wisdom
ఇక మన దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల నినాదాలు కూడా ఎంతో లోతైన అర్ధాన్ని కలిగి ఉన్నాయి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్: జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తే (జ్ఞానమే విముక్తుల్ని చేస్తుంది)
ఐఐఎం-అహ్మదాబాద్: విద్య వినయగోద్వికాశ్ (జ్ఞానాన్ని పంచడం ద్వారానే అభివృద్ధి సాధ్యం)
ఐఐటి-బెంగుళూరు: జ్ఞానం మర్మం ధ్యాతమ్ (జ్ఞానమే అంతిమ లక్ష్యం)
ఢిల్లీ యూనివర్సిటీ: నిష్ఠ ద్రితిహా సత్యం (అంకితభావం, దృఢత్వం, సత్యం)
అన్నా యూనివర్సిటీ: Progress through knowledge.
బిట్స్ పిలానీ: జ్ఞానం పరమం బలం (జ్ఞానమే శక్తి)
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్: Re-imaging Futures.
ఏ దేశం యొక్క, ఏ సంస్థ యొక్క నినాదాన్ని చూసిన ఎంతో గొప్పగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. అయితే ఆ దేశపు మనుషులు, ఆ సంస్థ యొక్క సిబ్బంది ఎంతవరకు ఆ నినాదాన్ని గుర్తు ఉంచుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు అని ఆలోచిస్తే నాకు విచారం కలుగుతుంది. బహుశా ప్రతి సంస్థ తమ నినాదాన్ని ఉద్యోగులలోకి తీసుకువెళ్లేందుకు, దానిపై అవలోకనం చేసేందుకు, దానిని తమ రోజువారీ కార్యక్రమాలను నిర్దేశించే గైడ్ గా ఉండేలా మలుచుకునేందుకు ఏడాదిలో కొంత సమయాన్ని వెచ్చించాలేమో. అప్పుడే ఆ నినాదం అందరినీ ఒక తాటిపైకి తెచ్చి, వారిలో స్ఫూర్తి నింపి వారికి మార్గదర్శకత్వం చేయగలదు. అప్పుడప్పుడు తమ నినాదాలను గుర్తుచేసుకుని వాటి నుండి స్ఫూర్తి పొందే ప్రయత్నాలు చేయకపోతే అవి కేవలం తమ ఆకాంక్షల యొక్క అవాస్తవ ప్రకటనలుగా కాగితాలపై మాత్రమే నిలిచిపోయే ప్రమాదం ఉంది.
Post 37
–Based on a piece by Meena